ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం విటిపిఎస్ లో వైర్ తెగిపోవడంతో రన్నింగ్ లో ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయలయ్యాయి. ప్రమాద సమయంలో లిప్ట్ లో ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
No comments:
Post a Comment