భర్త మరణం జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 1 March 2023

భర్త మరణం జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య


ఢిల్లీలో అజయ్‌ పాల్‌ (37), మౌనిక (32) అనే భార్యభర్తలిద్దరు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. మౌనిక పాల్‌ భర్త నోటి నుంచి నురగతో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో మౌనిక భర్తను హుటాహుటినీ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు ఆమె భర్త చనిపోయినట్లు ధృవీకరించారు. దీన్ని జీర్ణించుకోలేని మౌనిక వెంటనే ఇంటికి వచ్చి పాయిజన్‌ తీసుకుని అదే రోజు మధ్యాహ్నాం చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలుగొట్టి చూడగా మౌనిక విగతజీవిగా పడి ఉంది. దీంతో పోలీసులు ఆమె మృతదేహా​న్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో ఆమె భర్త ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌ని, ఇటీవలే అతను ఎయిర్‌ ఫోర్స్‌ జాబ్‌ నుంచి వైదొలగినట్లు వెల్లడించారు పోలీసులు. పైగా ఆ జంటకు రెండేళ్ల క్రితమే వివాహం అయ్యిందని తెలపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు దారితీసిన బలమైన కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment