లాభాల బాటలో ఎయిర్​లైన్స్​

Telugu Lo Computer
0


కరోనా మహమ్మారి వల్ల ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో విమాన ప్రయాణాలు పెద్దగా సాగని విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగంలోని ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఏఏఐ) ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో రూ. 1,900 కోట్ల నికర లాభం ఆర్జించనుందని అంచనా. మూడో క్వార్టర్లో ఎయిర్​లైన్స్​ కంపెనీల పనితీరును బట్టి ఇది అర్థమవుతుంది. మార్కెట్ వాటా ప్రకారం దేశంలో అతి పెద్ద ఎయిర్​లైన్​గా పేరొందిన ఇండిగో కిందటి క్వార్టర్లో రికార్డు లెవెల్​ ప్రాఫిట్​ ప్రకటించింది. మరోవైపు మొదలైన తర్వాత మొదటిసారిగా బ్రేక్​ఈవెన్​ సాధించినట్లు విస్తారా వెల్లడించింది. అనూహ్యంగా స్పైస్​జెట్​ లిమిటెడ్​ కూడా తన లాభాన్ని నాలుగు రెట్లు పెంచుకుంది. ఈ కంపెనీకి రూ. 106.80 కోట్ల నికర లాభం వచ్చింది. న్యూఢిల్లీ, ముంబై ఎయిర్​పోర్టులు రెండూ ప్రైవేటు రంగంలోనే నడుస్తున్నాయి. ఈ రెండు ఎయిర్​పోర్టుల వల్లే ప్రధానంగా ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఏఏఐ)కి ఎక్కువ ప్రయోజనం కలగనుంది. ఎందుకంటే ఈ రెండిటినీ నడిపే కంపెనీలు రెవెన్యూలో కొంత పర్సంటేజీని ఏఏఐకి చెల్లించాలి. ఎయిర్​ ట్రాఫిక్​ మెరుగుపడిన కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏఏఐ నికరలాభం సంపాదించనుందని స్పోక్స్​పర్సన్​ చెప్పారు. ఈ లాభం సుమారు రూ. 1,900 కోట్ల దాకా ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం జనవరి 2023 దాకా అంటే 10 నెలల్లో దేశంలోని ఎయిర్​పోర్టులు 267 మిలియన్​ల మంది పాసింజర్లను హ్యాండిల్​ చేశాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 82 శాతం ఎక్కువ. కొవిడ్​కి ముందు అంటే 2019-20 లోని ఎయిర్​ట్రాపిక్​లో 91 శాతాన్ని ఈ ఏడాది అందుకోగలిగాయి. ఫిబ్రవరి నుంచి ఎయిర్​ ట్రాఫిక్ జోరు మరింత పెరిగినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో సగటున రోజుకి 4.2 లక్షల మంది విమాన ప్రయాణాలు చేశారు. డిసెంబర్​ 2022 లో ఈ సంఖ్య 4.1 లక్షలు మాత్రమే. మార్చి 2022 తో ముగిసిన ఫైనాన్షియల్​ ఇయర్లో ఏఏఐకి రూ. 8.8 కోట్ల నికర లాభమే వచ్చింది. ఆ ఫైనాన్షియల్​ ఇయర్లో రెవెన్యూ రూ. 6,841 కోట్లు. 25 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా 2020-21 లో ఏఏఐ రూ. 1,962 కోట్ల నష్టం ప్రకటించింది. కరోనా కారణంగా ఎయిర్​ ట్రావెల్​ డిమాండ్​ తగ్గిపోవడం వల్లే నష్టాలు వచ్చాయి. ​ అదే కనక, 2019-20 కి చూస్తే ఏఏఐ రూ. 12,387 కోట్ల రెవెన్యూ మీద రూ. 1,985 కోట్ల నికర లాభం సంపాదించింది. 2021-22 కి డివిడెండ్​ చెల్లించలేమని ప్రభుత్వాన్ని అనుమతి కోరిన ఏఏఐ ఈ ఫైనాన్షియల్​ ఇయర్​కు మాత్రం నికరలాభంలో 30 శాతం దాకా డివిడెండ్​గా ప్రభుత్వానికి చెల్లించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏఏఐ కింద దేశంలోని 100 ఎయిర్​పోర్టులున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)