వేసవిలో చెరకు రసం !

Telugu Lo Computer
0


వేసవి కాలం వచ్చిందంటే అందరూ చెరుకు రసం తాగుతారు. ఈ కాలంలో ఎక్కడపడితే అక్కడ ఇది దొరుకుతుంది. 100 గ్రాముల చెరుకు రసంలో 39 క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది. దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉండవు కనుక అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా దీనిని తీసుకోవచ్చు. అలాగే చాలా మంది దీనిని తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయని భావిస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. చెరుకురసం తాగడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చెరుకు రసం వల్ల పళ్ళకు ఎలాంటి సమస్యలు రావు. తియ్యగా ఉన్నప్పటికి దంతాలు పుచ్చకుండా ఉంటాయి. చిగుళ్ళ సమస్య కూడా రాకుండా ఉంటుంది. సహజ సిద్దంగా లభించే చెరుకు రసం వల్ల మనకు మేలే తప్ప హానిని కలగదు. అయితే ఐస్ క్యూబ్స్, ఇతరత్రా పదార్థాలు ఏమి కలపకుండా తాజా చెరుకు రసం తీసుకోవాలి. అలా తాగితేనే దానిలోని పూర్తి గుణాలు మన శరీరానికి చేరతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)