వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలంటూ టోకరా !

Telugu Lo Computer
0


వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాల పేరుతో కేటుగాళ్లు లక్షల్లో మోసాలకు పాల్పడ్డారు. సామాజిక మాద్యమాల నుంచి ఉద్యోగం అంటూ కేటుగాళ్లు ఎరవేశారు. రూ. లక్షల్లో ఆదాయం అంటూ బాధితులకు సైబర్ నేరగాళ్లు గాలం వేశారు. నిజం అని నమ్మిన నలుగురు హైదరాబాదీల నుంచి రూ. 70 లక్షలు కాజేశారు. ఆన్ లైన్ ద్వారా షేర్ మార్కెట్, య్యూట్యూబ్ వీడియోలు క్లిక్ చేసే వర్క్ ఉందని నమ్మించారు. ఇంట్లోనే ఉంటూ లక్షల్లో సంపాదించవచ్చని బురిడీ కొట్టించారు. చివరకు మోసం పోయామని గుర్తించిన బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)