18 నెలల డీఏ ఇవ్వలేం !

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ అరియర్స్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. కోవిడ్ 19 సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్   ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వెల్లడించింది. 'డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించి మూడు ఇన్‌స్టాల్‌మెంట్లు నిలుపుదల చేశాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది వర్తిస్తుంది. 01.01.2020, 01.07.2020, 01.01.2021 కాలానికి సంబంధించి మూడు  ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ ఉద్యోగులకు అందలేదు. కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వంపై ఆర్థిక పరమైన ఒత్తిడి నెలకొంది. అందుకే డీఏ ఇవ్వలేకపోయాం' అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తాజాగా లోక్ సభలో ఈ విషయాన్ని వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)