లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్‌

Telugu Lo Computer
0


బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో లాలూ యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు ల్యాండ్ ఫర్ జాబ్ అక్రమాలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. కేసులో లాలూ యాదవ్‌తో పాటు ఆయన భార్య రబ్రీ దేవికి, కుమార్తె, ఎంపీ మిసా భారతికి కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తుపై లాలూ యాదవ్, మిసా భారతి, రబ్రీ దేవిలకు ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. కేసు తదుపరి విచారణను మార్చి 29న జరపనున్నట్లు కోర్టు తెలిపింది. రైల్వే ఉద్యోగాలకు బదులుగా కొందరి నుంచి భూములు తీసుకున్నట్లుగా లాలూ, రబ్రీ, మిసా భారతిపై ఆరోపణలున్నాయి. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కోసం నిందితులు ముగ్గురూ ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. లాలూ యాదవ్‌ వీల్ చైర్‌లో కోర్టు రూమ్‌ కు వెళ్లారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)