హిందీని బతకనివ్వరా ?

Telugu Lo Computer
0


ఇంగ్లీష్ వినియోగంపై బీహార్‌ ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ మండిపడ్డారు. ఈ సారి స్వయంగా రాష్ట్ర చట్టసభలోనే తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. రాష్ట్ర శాసనమండలిలో ఒక బోర్డు ఇంగ్లీష్ లో రాసి ఉండటాన్ని చూసి ఆయన కలత చెందారు. పక్కనే ఉన్న మండలి ఛైర్మన్‌ దేవేశ్‌ చంద్ర వద్ద తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. 'హానరబుల్‌, స్పీకింగ్‌ టైమ్‌ లాంటి ఇంగ్లీష్ పదాలను ఇంకా వాడటంలో అర్థం ఏముంది?  హిందీనీ అంతం చేయాలనుకుంటున్నారా' అంటూ కాస్త కఠిన స్వరంతోనే ప్రశ్నించారు. వెంటనే ఛైర్మన్‌ కల్పించుకొని పరిస్థితిని శాంతపరిచేందుకు ప్రయత్నించారు. ఈ సంభాషణ మొత్తం ఒక నిమిషంలోపే ముగిసినా ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

Post a Comment

0Comments

Post a Comment (0)