సెల్ ఫోన్ల ధ్వంసంపై 'ఇడి'వి కట్టుకథలే !

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మూడో సారి ఇడి విచారణ ముగిసింది. బుధవారం విచారణ ఉండబోదని, మళ్లీ ఎప్పుడు అనేది తెలియపరుస్తామని ఇడి అధికారులు చెప్పారని కవిత లీగల్ టీమ్ వివరించింది. మంగళవారం దాదాపు పది గంటల పాటు ఆమెను ఇడి అధికారులు విచారించారు. అయితే సాయంత్రం ఇడి ఆఫీస్ నుంచి కవిత న్యాయవాది సోమా భరత్‌కు పిలుపు రావడంతో ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. భరత్‌తో పాటు బిఆర్‌ఎస్ నేత దేవి ప్రసాద్ కూడా వున్నారు. ఈ సందర్భంగా ఇడి అడిగిన సమాచారాన్ని సోమా భరత్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో ఇడి కార్యాలయం వద్దకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అనంతరం మంగళవారం రాత్రి 9.44 గంటలకు కవిత ఇడి కార్యాలయంలోని గేట్ నెం 3 నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్యకర్తలకు, మీడియాకు అభివాదం చేస్తూ కారులో ముందుకు సాగారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కవిత ఇడి ఆఫీసుకు విచారణ కోసం వచ్చారు. మంగళవారం ప్రధానంగా మొబైల్ ఫోన్లపై ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. కవిత, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పేర్లున్న అందరి ఫోన్లు, కాల్ డేటాను ఇదివరకే ఇడి సేకరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎవరెవరు ఎన్ని ఫోన్లు వాడారు..? అనేదానిపై ఐఎంఈఐ నంబర్లతో సహా ఇడి వివరాలు బయటపెట్టింది. దీంతో మంగళవారం ఆ ఫోన్లనే అధికారులకు అంద జేయాలని కవితను సోమవారం ఇడి అధికారులు ఆదేశించారు. దీంతో కవిత ఆ పది ఫోన్లను ఇడికి సమర్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)