పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా విజయసాయి రెడ్డి

Telugu Lo Computer
0


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు విజయసాయి రెడ్డికి మరో అరుదైన అవకాశం లభించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా నామినేట్ అయిన ఆయన, ఇప్పుడు  పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ కోసం ఎన్నికైన సభ్యుల జాబితాను విడుదల చేసింది. ఈ కమిటీలో ఆయనతో పాటు డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, సయ్యద్ నాజిర్ హుస్సేన్, డాక్టర్ అనిల్ జైన్, ప్రకాష్ జవదేకర్, డాక్టర్ అమర్ పట్నాయక్, బినోయ్ విశ్వం ఎంపికయ్యారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులను కూడా రాజ్యసభ ఎంపిక చేసింది. దీనికోసం జరిగిన ఎన్నికల ప్రకియలో మొత్తం ఏడుగురికి సభ్యులగా అవకాశం దక్కింది. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఈ కమిటీలో సభ్యత్వాన్ని సాధించారు. ఆయనతో పాటు శక్తిసిన్హ్ గోహిల్, సుఖేందు శేఖర్ రాయ్, తిరుచ్చి శివ, డాక్టర్ ఎం తంబిదొరై, ఘన్‌శ్యామ్ తివారీ, డాక్టర్ సుధాంశు త్రివేది ఎన్నికయ్యారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)