నేనూ కాస్టింగ్ కౌచ్ బాధితుడనే !

Telugu Lo Computer
0


కెరీర్‌ తొలినాళ్లలో క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ బుల్లితెర నటుడు బిగ్ బాస్ 16 రన్నరప్ శివ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక సారి ఆరమ్‌ నగర్‌కు ఆడిషన్‌ కోసం వెళ్లాను. ఓ డైరెక్టర్‌ నన్ను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అక్కడ మసాజ్‌ సెంటర్‌ ఉందని చెప్పాడు. ఆడిషన్‌కు వస్తే మసాజ్‌ సెంటర్‌ అంటున్నాడు ఏంటబ్బ అని అనుకున్నా, ఆడిషన్‌ పూర్తయ్యాక..మసాజ్‌ సెంటర్‌కు రా..,నీతో పనుంది అని చెప్పాడు. అవకాశాల కోసం నేను అప్పటికే ఎంతో కష్టపడ్డాను. కానీ అందుకోసం అలాంటి పని చేయడం ఇష్టం లేదు. దీంతో అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేశా. ఆడిషన్ కు రావాలంటూ ఓ సారి మహిళ నుంచి అర్థరాత్రి 11 గంటలకు పిలుపొచ్చింది. ఆమెకు నాలుగు బిల్డింగ్ లు ఉన్నాయని చెప్పింది. ఇండస్ట్రీలో ఎంతో మందిని స్టార్లను చేశానని గొప్పలు చెప్పింది. అయితే రాత్రి 11 గంటలకు ఆడిషన్‌ ఉంది రావాలని చెప్పింది..\ ఆమె ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది.. వెంటనే అర్ధరాత్రి ఆడిషన్‌ ఏంటి..? నాకు పని ఉందండి..,రాలేనని చెప్పేశా... దీంతో ఆమెకు కోపం వచ్చింది. నీకు సినిమాలు చేయాలని లేదా.. రాత్రికి రాకపోతే నీకు అవకాశాలు దొరకవు అని బెదిరించింది. అయినా లెక్కచేయలేదని శివ ఠాక్రే చెప్పుకొచ్చాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)