ఆంధ్రప్రదేశ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్

Telugu Lo Computer
0


గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న వైజాగ్‌కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా శుభం జరగాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ దేశంలోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. వైజాగ్‌లోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదనాంలో ఈ నెల 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పారిశ్రామికవేత్తలను, విదేశీ ప్రతినిధులు ఆహ్వానించనున్నారు. ఈ రెండు రోజుల సందస్సులో మొత్తం 9 రంగాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో 26 దేశాలు పాల్గొననున్నాయి. 8 వేల మంది అతిథులు, పెట్టుబడిదారులు హాజరు కానున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)