ప్రజలను పిచ్చోళ్లను చేసి ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరు !

Telugu Lo Computer
0


కర్ణాటకలో నందగఢ్ లో బీజేపీ ''విజయ్ సంకల్ఫ్ యాత్ర'' రెండో విడతను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించి మాట్లాడుతూ  కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఉనికికే భారత్ జోడో యాత్ర ప్రారంభం అయిందని, జోడో యాత్రలో 1947లో విడిపోయిన భారత్ ను కలిపేందుకు ఆయన కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నా అంటూఎద్దేవా చేశారు. భారత్ ఏకంగా, సఖ్యతతో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఈ యాత్రను ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. ప్రజలను పిచ్చోళ్లను చేసి ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరని అన్నారు. ప్రజలను కంటికి రెప్పలా చూసుకునే వారిని ప్రజలు ఆదరిస్తారని అన్నారు. అది బీజేపీ మాత్రమే చేయగలదని అన్నారు. ప్రధాని మోదీకి ''సమాధి తవ్వుతాం'' అని విమర్శలు చేస్తున్నారు, కానీ వారు వారి సమాధినే తవ్వుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. బీజేపీ, ప్రధానిమోదీపై ఎంత బురదజల్లితే అంతగా కమలం వికసిస్తుందని అన్నారు. రక్షణ మంత్రిగా నేను మన సైనిక బలగాల ధైర్యసాహసాలు చూసి గర్వపడుతున్నానని అన్నారు. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని, మేఘాలయాలో బీజేపీ సీట్లు పెరిగాయని, మూడింట రెండొంతుల మెజారిటీతో కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని రాజ్ నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ఎప్పుడూ మాటపై నిలబడుతుందని, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు వంటివి తీసుకువచ్చామని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)