దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు

Telugu Lo Computer
0


దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు  మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. ఆరు రాష్ట్రాలకు లేఖలో రాసిన వాటిలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌, కర్ణాటక ఉన్నాయి. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖల్లో సూచించారు. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టెస్ట్ ట్రాక్, ట్రీట్ వ్యాక్సినేషన్ వ్యూహాన్ని అనుసరించాలని కేంద్రం కోరింది. దాదాపు నాలుగు నెలల తర్వాత భారత్‌లో అత్యధిక సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి. గతేడాది నవంబర్‌లో 734 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసులు ఆ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కరోనా మహమ్మారితో కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,633 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో లో ఇప్పటివరకు నమోదైన కొవిడ్​ కేసుల సంఖ్య 4,46,92,710కు చేరింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297కి చేరింది. దేశవ్యాప్తంగా 220.64 కోట్ల వాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)