ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆరు మద్యం బాటిల్స్ !

Telugu Lo Computer
0


ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం ధరలు చూస్తే ఇంతటి ఖరీదైన ఆల్కహాల్ తాగడం ఎవరి వల్ల అవుతుందని కొందరు ఫీలవుతుంటారు. కాని వాటి కోసం ప్రత్యేకమైన కస్టమర్లు ఉంటారు.

వరల్డ్‌లోనే వెరీ కాస్ట్లీ వైన్‌గా ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది టేకిలా లీ .925. దీని ధర దాదాపు రూ. 25 కోట్ల రూపాయలు. ఈ మందులో మత్తు సంగతి ఏమో కాని సీసాలో 6400 వజ్రాలు పొదిగి ఉండటం విశేషం

ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన వైన్ హెన్రీ IV డుడోగాన్ కాగ్నాక్. ఈ బ్రాండ్ మద్యం ఒక్క బాటిల్ ఖరీదు అక్షరాల 56 లక్షల 93 వేల రూపాయలు. దీని బాటిల్ కూడా 24 క్యారెట్ల బంగారం మరియు ప్లాటినంతో తయారు చేయబడింది.

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మద్యం కేటగిరీలో దివా వోడ్కా కూడా ఉంది. దివా వోడ్కా ఒక్క ఫుల్ బాటిల్ ధర 7 కోట్ల 30 లక్షల రూపాయలు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీగా డెల్మోర్ 62 చెప్పబడుతుంది. ఎందుకంటే అందులో ఒక్క బాటిల్ ఖరీదు రూ.1.5 కోట్లకు పైగానే ఉంటుంది. మరి ఇంత ఖరీదైన మందు తాగే వాళ్లు కూడా అంతే రిచ్‌గా ఉంటారు.

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన షాంపైన్ గురించి చెప్పాల్సి వస్తే అమండా డి బ్రిగ్నాక్ మిడాస్ పేరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ షాంపైన్ ఒక్క బాటిల్ ధర దాదాపు రూ.1 కోటి 40 లక్షల రూపాయలు.

పెన్ఫోల్డ్స్ ఆంపౌల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెడ్ వైన్. ఈ బ్రాండ్‌ రెడ్‌ వైన్‌ ఒక బాటిల్ రేటు వచ్చేసి కోటి 20 లక్షల రూపాయలు ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)