రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష !

Telugu Lo Computer
0


పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రాహుల్‌ను దోషిగా గుర్తించి, తీర్పు ప్రకటించిన తర్వాత, కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది. పైకోర్టులో అప్పీలు చేసుకొనేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ కేసులో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ చీఫ్ జ్యుడిషియల్ గత వారం విచారణ ముగించి, తీర్పు వాయిదా వేశారు. గురువారం కోర్టుకు రాహుల్ హాజరయ్యారు. దొంగలందరి ఇంటి పేర్లలో 'మోడీ' అని ఎలా ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించారంటూ ఈ కేసు దాఖలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్నాటకలోని కోలార్‌లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రాహుల్‌పై ఫిర్యాదు దాఖలు చేసినన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ, కోర్టు తీర్పును స్వాగతించారని ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది. రాహుల్‌కు ఈ కేసులో గరిష్ఠ శిక్ష విధించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలతో ఏ కమ్యూనిటీ మనసూ నొప్పించాలనుకోలేదని విచారణ సందర్భంగా రాహుల్ కోర్టుకు నివేదించారని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)