హైదరాబాద్‌లో మహిళలకు ఉచిత బస్సు సర్వీసు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు షీ షటిల్‌ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. డీజీపీ అంజనీ కుమార్ ఉచిత బస్సు సర్వీస్‌ను జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఐదవ ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి డీజీపీ అంజనీ కుమార్ హాజరు కాగా, సీపీ స్టీఫెన్ రవీంద్ర,  కృష్ణ ఏదుల, పోలీసు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బస్సు సర్వీసు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు ఉంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు ప్రయాణిస్తుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)