సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషపూరితం పఫర్ ఫిష్ !

Telugu Lo Computer
0


ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ బీచ్‌లో ఒక యువతి తన పెంపుడు కుక్క సరదాగా షికారు చేస్తున్నారు. ఈ సమయంలో ఆ కుక్క బీచ్ లో ఉన్న చనిపోయిన చేపను తీయడాన్ని గమనించింది. నోట కరచుకున్న చేపని వదలడానికి తన కుక్క నిరాకరించిందని, అప్పుడు తాను దానిని కుక్క నోటి నుండి తీసివేయవలసి వచ్చింది. అది ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన చేప జాతులలో ఒకటైన పఫర్ ఫిష్ . ఇలా చేస్తున్న సమయంలో తన బొటనవేలుపై చిన్న ముళ్లు గుచ్చుకున్నట్లు తాను భావిస్తున్నానని తెలిపింది. మరి ఇప్పుడు మేము బాగుంటామా?” అంటూ ప్రశ్నించింది. ఈ పఫర్ ఫిష్‌ లో 30 మందిని చంపడానికి తగినంత విషం ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు పఫర్ ఫిష్ చనిపోయిన లేదా సజీవంగా ఉన్నా తింటే మానవులకు, జంతువులకే కాదు ఎవరికైనా ప్రాణాంతకం కావచ్చని తెలుస్తోంది. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన జీవుల్లో ఒకటి పఫర్ ఫిష్. దీని చర్మంపై, అంతర్గత అవయవాల్లో టెట్రోడోటాక్సిన్ అనే టాక్సిన్‌ను కలిగి ఉంటుంది. ఇలాంటిది నీలిరంగు ఆక్టోపస్‌లో కూడా కనిపిస్తుంది. యానిమల్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రకారం ఇది సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషపూరితమైనది. స్మాల్ యానిమల్ స్పెషలిస్ట్ హాస్పిటల్‌లోని న్యూరాలజీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ జార్జినా చైల్డ్ ఈ టాక్సిన్ “నిమిషాల్లో” జంతువులను చంపేస్తుందని హెచ్చరించింది. ఈ చేపను టచ్ చేసిన తర్వాత ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న వెంటనే సమీపంలోని వెట్‌కి తరలించాలని సూచించారు. తరచుగా వాంతులు చేసుకోవచ్చు .. చాలా త్వరగా బలహీనపడవచ్చు, నిలబడటానికి ఇబ్బంది పడతారు” అని డాక్టర్ జార్జినా చైల్డ్ చెప్పారు. అంతేకాదు ఆ జీవి కదిలే సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుంది. తరువాత శోషించబడిన టాక్సిన్ పరిమాణాన్ని బట్టి శ్వాస తీసుకోలేనంత వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)