కొచ్చి విమానాశ్రయంలో కూలిన భారత కోస్ట్ గార్డ్ హెలికాప్టర్

Telugu Lo Computer
0


కేరళ కొచ్చిలోని విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే భారత కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ఏఎల్ హెచ్  ధ్రువ్ మార్క్ 3 కుప్పకూలిపోయింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. టేకాప్ అయిన కొద్దిసేపటికే భూమికి కేవలం 25 అడుగులు ఎత్తులో ఉండగా కూలిపోయినట్లు వివరించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై ఐసీజీ దర్యాప్తు చేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రధాన రన్‌వేకు ఆటంకం కలగకుండా హెలికాప్టర్ శిథిలాలను వెంటనే పక్కకు తప్పించారు. పైలట్లు హెలికాప్టర్ ను సాధ్యమైనంత సాఫీగా ల్యాండ్‌ అయ్యేలా చూశారని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో హెలికాప్టర్‌లోని ఒక వ్యక్తి చేతికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. హెలికాప్టర్ రెక్కలు, ఎయిర్‌ఫ్రేమ్‌ దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో కొచ్చి విమానాశ్రయంలో కార్యకలాపాలను రెండు గంటల పాటు నిలిపివేశారు. ఇక్కడికి వచ్చే విమానాలను తిరువనంతపురం, కోయంబత్తూర్‌ విమానాశ్రయాలకు మళ్లించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాకపోకలను పునరుద్ధరించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)