పెరుగుతున్న సముద్ర మట్టాలు !

Telugu Lo Computer
0


వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓజోన్ లేయర్ దెబ్బతినడంతో పాటు భూమిపై హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రమట్టాలు పెరుగుతాయని, దీని వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ముప్పు ఏర్పడుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని కోస్టల్ సిటీలు చెన్నై, కోల్‌కతా ముప్పును ఎదుర్కొంటాయని అంచానా వేసింది. సముద్రమట్టాలు 20-30 శాతం పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. దీనిల్ల 2100 నాటికి ఈ రెండు నగరాలతో పాటు ఆసియాలోని మెగాసిటీలు అయిన యాంగూన్, బ్యాంకాక్, హోచిమిన్ సిటీ, మనీలా నగరాలు కూడా ముప్పును ఎదుర్కోనున్నాయి. పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల వల్ల నీరు విస్తరిస్తుంది, మంచుపలకలు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరుగుతాయి. సముద్ర ప్రవాహాల్లోని మార్పుల కారణంగా అమెరికాలోని ఈశాన్యభాగం, మరికొన్ని తీర ప్రాంతాల్లోకి ఎక్కువ నీటి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. పిలిఫ్పీన్స్ రాజధాని మనీలా కేవలం వాతావరణ మార్పుల కారణంగా 2006 కన్నా 2100లో తీర్ ప్రాంతా వరదలు 18 రెట్లు ఎక్కువగా సంభవిస్తాయని అధ్యయంన తెలిపింది. పరిస్థితులు మరింత తీవ్రంగా మారితే.. ఇది 96 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతర్గత వాతావరణ వైవిధ్యం అమెరికా, ఆస్ట్రేలియా పశ్చిమ తీరాల వెంబడి సముద్ర మట్టం పెరుగుదలను కూడా పెంచుతుందని స్టడీ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)