మామతో కోడలు జంప్ !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని బుండీ జిల్లాలోని సిలార్ గ్రామంలో పవన్ వైరాగీ అనే వ్యక్తి భార్య, తండ్రి రమేశ్ వైరాగీతో నివాసం ఉంటున్నాడు. పవన్ దంపతులకు ఆరు నెలల చిన్న పాప కూడా ఉంది. ఇంట్లోనే ఉంటోన్న మామ, కోడలు మధ్య ప్రేమ చిగురించింది. దీంతో.. పవన్ లేని సమయంలో వాళ్లు రాసలీలలు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి పారిపోయారు. దీంతో పవన్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య, తండ్రి ఇద్దరు లేచిపోయారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు తన భార్య అమాయకురాలని, మాయమాటలు చెప్పి తన తండ్రే ఆమెను తీసుకెళ్లాడని పేర్కొన్నాడు. తన తండ్రి ఇల్లీగల్ పనులు చేసేవాడని కూడా పవన్ తెలిపాడు. తన భార్యను ఎత్తుకెళ్లడమే కాకుండా, తన ద్విచక్ర వాహనాన్ని సైతం తండ్రి దొంగలించాడంటూ పవన్ చెప్పుకొచ్చాడు. ఎలాగైనా ఆ ఇద్దరి ఆచూకీ కనుగొనాలని పవన్ పోలీసుల్ని కోరాడు. ఈ కేసుని పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఇప్పటివరకూ కేసు ముందుకు కదల్లేదని పవన్ ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలపై స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి అర్వింద్ భరద్వాజ్ మాట్లాడుతూ  తాము ఈ కేసుని శ్రద్ధగా పరిశీలిస్తున్నామని చెప్పారు. దొంగలించబడ్డ ఆ ద్విచక్ర వాహనంతో పాటు పారిపోయిన ఆ జంట ఆచూకీ కనుగొనడం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)