నన్ను ఎవరూ ఏమీ చేయలేరు !

Telugu Lo Computer
0


'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ కొత్త వీడియో విడుదల చేశాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరన్నాడు. ఎవరికి భయపడే ప్రసక్తే లేదన్నాడు. పంజాబ్ పోలీసులు తన టచ్ కూడా చేయరని సవాల్ విసిరాడు. దేవుడి ఆశీస్సులు ఉన్నన్ని రోజులు పోలీసులు తనను పట్టుకోలేరని స్పష్టం చేశాడు. బైసాఖిలో సర్భత్ ఖల్సా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వరల్డ్ వైడ్ గా ఉన్న సిక్కులు, సిక్కు సంస్థలకు అమృత్ పాల్ వీడియోలో కోరారు. చిన్న చిన్న సమస్యలపై పోరాటాలు చేయడంతో మునిగిపోయామని, పంజాబ్ సమస్యలు పరిష్కరించాలంటే అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. సిక్కులందరూ ఐక్యమత్యంతో ఉండాలని చెప్పాడు. పంజాబ్ ప్రభుత్వం తమను మోసం చేసిందన్నాడు. ఎంతో మంది కార్యకర్తలను అరెస్ట్ చేసిందని, ఎన్ఐఏ విచారణ ఎదర్కొంటున్నారని వెల్లడించారు. వీరిలో కొందరిని అస్సాంకు తరలించారని అమృత్ పాల్ సింగ్ అన్నారు. అమృత్ పాల్ సింగ్ మార్చి 18న తప్పించుకున్న తర్వాత తొలి వీడియోను విడుదల చేశాడు. పెద్ద సంఖ్యలో సిక్కులు తరలివచ్చి వైశాఖంలో సర్బత్ ఖల్సాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశాడు. అకాల్ తఖ్త్ జతేదార్ మార్చి 19న ఆదివారం అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన సమావేశం తర్వాత జతేదార్ తీసుకున్న చొరవను ప్రస్తావిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. వీడియోలో, తాను చార్డీ కలాన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. పంజాబ్ లో వేర్పాటు వాదాన్ని పెంచిపోషించాలని అనుకున్న అమృత్ పాల్ సింగ్..ఫిబ్రవరిలో తన అనుచరుడిని విడిపించుకోవడానికి అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేశాడు. ఎస్పీతో సహా పలువురు పోలీసులపై దాడి చేశాడు. దీంతో పంజాబ్ ప్రభుత్వం అతన్ని పట్టుకోవడానికి భారీ ఆపరేషన్ నిర్వహించింది. అయితే 12 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న అమృత్ పాల్ సింగ్ కు , అతని అనుచరులకు పాకిస్తాన్ ఐఎస్ఐ, ఖలిస్తానీ ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)