ఆందోళనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్‌ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 24 March 2023

ఆందోళనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్‌


ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ఆ దేశ ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా రుద్దిన పెన్షన్‌ సంస్కరణలపై ఫ్రాన్స్‌లో జన ప్రభంజనం ప్రకంపనలు రేపుతోంది. ఫ్రాన్స్‌లో పెన్షన్‌దారుల వయస్సు పెంచింది.  దీంతో పెన్షన్‌దారుల వయస్సు పెంపుదలకు వ్యతిరేకంగా జనం ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వోద్యోగుల పెన్షన్‌ వయస్సును 62 నుంచి 64 ఏళ్ళకు పెంచుతూ చట్టం తెస్తోన్న ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ విధానాలపై జనం మండిపడుతున్నారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. టీచర్లు, ఇతర ప్రభుత్వోద్యోగులందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వ బలగాలు ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతోంది. సెంట్రల్‌ పారిస్‌లో ఆందోళన కారులు షాప్‌లను ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌ని ధ్వంసం చేయడంతో పోలీసులకూ, ఆందోళనకారులకూ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌, స్టన్‌ గ్రెనేడ్స్‌ ఉపయోగించారు. వేలాది మంది పలు నగరాల నుంచి పారిస్‌కి తరలివచ్చారు. వందలాది మందిని అరెస్టు చేశారు. అది అప్రజాస్వామికమని ప్రజలు గళమెత్తి నినదిస్తున్నారు. 35 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం మరింత హింసాత్మకంగా మారే ప్రమాదం ఉన్నదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

No comments:

Post a Comment