కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు డీఏ పెంపు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 25 March 2023

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు డీఏ పెంపు


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరువు భత్యాన్ని 38 శాతం నుంచి 42 శాతానికి పెంచారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో, కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని పెంచుతుంది.  కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్, పింఛనుదారుల డియర్‌నెస్ రిలీఫ్ పెంపు నిర్ణయం జనవరి 1, 2023 నుండి వర్తించేలా పరిగణించబడుతుంది. అంటే ఉద్యోగులు, పింఛనుదారులకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంపు నిర్ణయం తర్వాత ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.12,815.60 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయంతో 47.58 లక్షల మంది ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయించిన ఫార్ములా ఆధారంగా ఈ పెంపుదల జరిగింది. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు కారణంగా కేంద్ర ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల ఉంటుంది. ఉదాహరణకు కేంద్ర ఉద్యోగి మూల వేతనం రూ.25500 అనుకుందాం. 38 శాతం డీఏ ప్రకారం ఇప్పుడు రూ.9690 అందుబాటులో ఉంది. డీఏ 42 శాతంగా మారితే డియర్‌నెస్ అలవెన్స్ రూ.10,710కి పెరుగుతుంది. అంటే ప్రతి నెలా జీతం రూ.1020 పెరుగుతుంది.

No comments:

Post a Comment