బండి, ఈటల, ప్రవీణ్ కుమార్ అరెస్టు

Telugu Lo Computer
0


తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలో కలిసి టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై గన్‌పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు సంజయ్ తో కాసేపు చర్చలు జరిపారు. గన్‌పార్క్ నుంచి టిఎస్‌పిఎస్‌పికి వెళ్తున్న బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‌తో పాటు ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌ను తరలిస్తున్న వాహనాన్ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు, నిరుద్యోగులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. బీఎస్పీ ఆఫీస్‌లో దీక్ష చేస్తున్న బీఎస్పీ  నేత ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి ఇంటికి తరలించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ కేసుపై సిబిఐతో విచారణ జరిపించాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)