మైనర్ తో స్కూల్‌లోనే టీచరమ్మ శృంగారం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 14 March 2023

మైనర్ తో స్కూల్‌లోనే టీచరమ్మ శృంగారం !


అమెరికా లోని ఫ్లోరిడాలో విన్‌త్రోప్ కాలేజ్ ప్రిపరేటరీ అకాడమీలో పైజ్ మోర్లీ అనే 22 ఏళ్ల యువతి టీచర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. తాను పాఠాలు చెప్పే క్లాస్‌లోని ఓ మైనర్ యువకుడి పట్ల ఆకర్షితురాలైన మోర్లీ, స్కూల్ ముగిసిన తర్వాత సాయంత్రం పూట కొంతం సమయం గడపడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి నుంచి అతనితో రాసలీలలు సాగిస్తోంది. ఒక్కోసారి స్కూల్‌లోనే బ్రేక్ సమయంలో ఆ విద్యార్థిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అతనితో శృంగారంలో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఆ టీచర్ ఒకసారి పట్టుబడింది. దీంతో స్కూల్ యాజమాన్యం మోర్లీపై చర్యలు తీసుకుంది. మైనర్ విద్యార్థితో ఇలాంటి ఎఫైర్ పెట్టుకోవడం చట్టరీత్యా నేరం కావడంతో ఆమెని విధుల్లో నుంచి తొలగించడంతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసింది. ఆమె నేరం రుజువు కావడంతో అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్‌కి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ ''ఎంతో నమ్మకస్తులైన మోర్లీ తనకున్న అధికారాన్ని, స్థాయిని ఇలా దుర్వినియోగం చేయడం నిజంగా దురదృష్టకరం'' అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు వారిలో సానుకూల ప్రభావాన్ని నింపాల్సిన ఈ టీచర్, అందుకు భిన్నంగా వక్రబుద్ధి చూపించి, ఉపాధ్యాయ పదవికే మచ్చ తెచ్చిందని మండిపడ్డారు. మోర్లీపై అనేక చార్జెస్ నమోదు చేశారు. అశ్లీలకరమైన వేధింపులు, అసభ్యకరంగా ప్రవర్తించడం, విద్యార్థిని లోబరచుకోవడం, మైనర్‌తో రొమాంటిక్ రిలేషన్‌షిప్ పెట్టుకోవడం వంటి అభియోగాలు మోపారు.

No comments:

Post a Comment