కాశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ రేస్ ప్రారంభం !

Telugu Lo Computer
0


ఆసియాలోనే అత్యంత పొడవైన సైకిల్ రేస్ కాశ్మీర్ నుంచి ప్రారంభమైంది. 12 రోజుల పాటు జరిగే ఈరేసు కన్యాకుమారిలో ముగుస్తుంది. శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు మెుత్తంగా 3,651 కి.మీ రేసు ఉంటుంది.ఈ రేసు 12 రాష్ట్రాలు, మూడు మహానగరాలు, 20కిపైగా నగరాల మీదుగా సాగుతుంది. దేశవ్యాప్తంగా ఒక మహిళతో సహా 29 మంది సైక్లిస్టులు ఈ రేసులో పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్‌ను జమ్మూ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ సపోర్టుతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఈ సైకిల్ రేసును కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ వి కె బిధురి జెండా ఊపి మార్చి 01, బుధవారం నాడు ప్రారంభించారు. ప్రపంచ అల్ట్రాసైక్లింగ్ అసోసియేషన్ ఈ రేసుకు ఆసియా అల్ట్రాసైక్లింగ్ ఛాంపియన్‌షిప్ హోదాను కల్పించిందని అల్ట్రా సైక్లింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జితేంద్ర నాయక్ చెప్పారు. సైక్లిస్టులు రేసును పూర్తి చేయడానికి నిర్వాహకులు 12 నుండి 14 రోజుల సమయాన్ని నిర్దేశించగా.. ఇందులో పాల్గొనేవారు తొమ్మిది నుండి 11 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రేసులో పాల్గొనేవారిలో గీతా రావు ఒక్కరే మహిళా సైక్లిస్ట్. మార్గంలో 13 టైమ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని... వీటిని మార్షల్స్ నిర్వహిస్తారని నాయక్ చెప్పారు. రైడర్‌లను జీపీఎస్ పరికరాలను ఉపయోగించి ట్రాక్ చేస్తారు. ఈ సైకిల్ రేసులో పాల్గొనేవారు వరుసగా 12, 10, 8 రోజుల నిర్దేశిత టైంతో.. సోలో, 2 టీమ్, 4 టీమ్ లో పెడ్లింగ్ చేయాల్సి ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)