వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 30 March 2023

వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది !


ఆంధ్రప్రదేశ్ లో సీట్లకు అంగీకారం కుదిరినట్లుగా వచ్చిన వార్తలను పవన్ కల్యాణ్ ఖండించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు కట్టుబడి ఉన్నానని, పొత్తుల విషయంలో వ్యూహాల నిర్ణయం తనకు వదిలేయాలని పవన్ కల్యాణ్ కోరారు. ఇప్పుడు పార్టీ నేతలకు పవన్ కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా మైండ్ గేమ్ కు లొంగేది లేదని..పొత్తులపై పారదర్శకంగా ఉంటామని జనసేనాని స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో అధికార వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని, ఎవరూ ఆందోళనకు గురి కావద్దని జనసేనాని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు పార్టీలోకి కొందరు ముఖ్య నేతలతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించినట్లు సమాచారం. వైసీపీ మైండ్‌గేమ్‌లో కార్యకర్తలు, పార్టీ నాయకులు పడవద్దని సూచించారు. పొత్తులపైన ఎటువంటి వ్యూహం అమలు చేసినా.. పార్టీలో చర్చిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టిపరిస్థితుల్లో కూడా చీలనివ్వబోమని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నిర్ణయాలను పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

No comments:

Post a Comment