అర గంట పాటు ఏకధాటిగా కురిసిన పిడుగులు !

Telugu Lo Computer
0


ఒడిశాలోని భద్రక్‌ జిల్లా బాసుదేవపూర్‌లో బుధవారం సాయంత్రం  అరగంట వ్యవధిలో ఏకంగా 5.450 పిడుగులు పడ్డాయి.   ఈ ఘటనలతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దగా ఆస్తి నష్టం జరగకపోయినా వరుసగా పడిన ఈ పిడుగుపాటు శబ్దాలకు బాసుదేవపూర్‌ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అరగంటపాటు ఏకధాటిగా కురిసిన పిడుగులతో జనం బెంబేలెత్తిపోయారు. ఇటువంటివి అసాధారణం ఏమీ కాదని గతంలో కూడా జరిగాయని ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని గోపాల్‌పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (ఐఎండీ) అధికారులు సూచించారు. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయని తెలిపారు. వాతావరణ ఒడిదుడుకులతో ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో భద్రక్‌ జిల్లా బాసుదేవపూర్‌లో ఏకంగా వేల సంఖ్యలో పిడుగులు పడి ప్రజల్ని హడలెత్తించాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. అదే సమయంలో బలమైన గాలులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలున్నాయని ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)