బాలిక కడుపులో వెంట్రుకలు !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ముంబై, దాదార్ ప్రాంతానికి చెందిన 10 ఏళ్ల బాలిక తన కడుపును తాకినప్పుడు ఏదో బలమైన వస్తువు చేతికి తగిలినట్లు అనిపించింది. దీంతో భయంతో బాలిక విషయాన్నితల్లికి చెప్పింది. దీంతో అప్రమత్తమైన తల్లి  కుమార్తెను వెంటనే బాయి జెర్‌బై వాడియా చిల్డ్రన్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ సీటీ  స్కాన్‌ చేశారు వైద్యులు. రిపోర్టు చూసి లోపల ఉన్నది వెంట్రుకల ముద్ద అని గ్రహించారు. బాలిక ట్రైకోటిల్లోమానియా వ్యాధి ఉందని గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేశారు వైద్యులు. 2 గంటల శస్త్రచికిత్స అనంతరం బాలిక కడుపు నుంచి 100 గ్రాముల హెయిర్‌బాల్‌ను విజయవంతంగా తొలగించారు. బాలిక పరిస్థితి బానే ఉండటంతో  7 రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)