రూ.78,800 కోట్లతో ఢిల్లీ బడ్జెట్ !

Telugu Lo Computer
0


ఢిల్లీ ప్రభుత్వం బుధవారం రూ.78,800 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ బడ్జెట్ మంగళవారమే ప్రవేశపెట్టాల్సి ఉండగా, కేంద్ర హోంశాఖ చేసిన అలక్ష్యం వల్ల ఒకరోజు ఆలస్యమైంది. బడ్జెట్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రెండ్రోజులు యుద్ధమే జరిగింది. ప్రజా ఉపయోగాల కంటే ప్రకటనలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించారని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలుపగా, మౌలిక సదుపాయాలకు కేటాయించిన దాంట్లో కనీసం నాలుగో వంతు కూడా ప్రకటనలకు కేటాయించలేదని ఢిల్లీ ప్రభుత్వం తిప్పి కొట్టింది. రెండు రోజుల హైడ్రామా అనంతరం ఢిల్లీ ఆర్థిక మంత్రి కైలాష్ గెహ్లాట్ ఎట్టకేలకు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మొత్తం 78,800 కోట్ల రూపాయలతో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‭లో మౌలిక సదుపాయాలకు అత్యధికంగా 20 వేల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత విద్యకు అత్యధికంగా 16,600 కోట్ల రూపాయలు కేటాయించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)