ఉక్రెయిన్​కు ఐఎంఎఫ్​ అప్పు

Telugu Lo Computer
0


ఉక్రెయిన్​కు 15.6 బిలియన్​డాలర్లు అప్పు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ అంగీకారం తెలిపింది. దీనిపై ఇరుపక్షాలు ఓ అగ్రిమెంట్​ను కుదుర్చుకున్నాయి. ఈ లోన్ ద్వారా సమకూరే నిధులను ఉక్రెయిన్​ ప్రభుత్వ అవసరాలను తీర్చడానికి వినియోగించనున్నారు. ఈ రుణాన్ని​నాలుగేళ్లలో విడతల వారీగా ఉక్రెయిన్​కు ఐఎంఎఫ్ అందిస్తుంది. లోన్​ మంజూరయ్యాక మొదటి 12 నుంచి 18 నెలల్లోగా దేశ బడ్జెట్​ లోటును పూడ్చుకోవడంపై ఉక్రెయిన్​ ఫోకస్​ చేస్తుంది. ''సెంట్రల్​ బ్యాంక్​ ద్వారా కరెన్సీని ముద్రించుకొని దేశ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం మొదలు పెడితే ఉక్రెయిన్​ కరెన్సీ విలువ పతనమయ్యే ముప్పు ఉంటుంది. ఇలా జరగకుండా మేం అందించే లోన్​ హెల్ప్​ చేస్తుంది'అని ఐఎంఎఫ్​ ఒక ప్రకటనలో తెలిపింది. జీ7 దేశాలు, యూరోపియన్​ యూనియన్​ దేశాల నుంచి రానున్న రోజుల్లో ఉక్రెయిన్​కు​ ఆర్థిక సహాయక ప్యాకేజీలు అందుతాయనే సానుకూల దృక్పథంతో ఈ లోన్​ను మంజూరు చేసినట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది. రష్యాను ఎదుర్కొనేందుకు గతేడాది సైనిక వ్యయాలను ఉక్రెయిన్​ భారీగా పెంచింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా దాదాపు 30 శాతం పడిపోయింది. సంక్షోభ పరి స్థితుల కారణంగా ఉక్రెయిన్​ఖజానాకు పన్నుల రూపంలో ప్రజల నుంచి సమకూరే ఆదాయాలు కూడా డౌన్​ అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)