ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటన

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి అత్యవసర కార్యవర్గ సమావేశం ముగిసింది.. ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై చర్చించి  ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. మినిట్స్ కాపీలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగించాలని అత్యవసర కార్యవర్గం అభిప్రాయపడింది.  ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు  ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. నేటి నుంచి మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది. మా ఉద్యమాన్ని నిజాయితీగా కొనసాగిస్తాం.. ప్రభుత్వం కొన్ని అంశాలకు సానుకూలంగా స్పందించింది. అందుకే ఉద్యమ తీవ్రత తగ్గించి శాంతియుతంగా నిరసనలు తెలుపుతామని వెల్లడించారు. ఉద్యోగుల ఆవేదన చూసి అయినా ప్రభుత్వంలో మార్పు రావాలని కోరుతున్నాం. గతంలో చేసిన పోరాట ప్రణాళికలో చిన్న చిన్న మార్పులు చేశామని, నేటి నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చే నెల 5వ తేదీ వరకు విధుల్లో పాల్గొంటాం అన్నారు. ఈనెల 17, 20 తేదీల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించి మద్దతు కోరతామన్న ఆయన, ఈ నెల 21వ తేదీన సెల్‌ డౌన్ యథావిథిగా ఉంటుందన్నారు. 27వ తేదీన కారుణ్య నియామకాలు కోసం వారి కుటుంబం సభ్యులను కలుస్తాం. వచ్చే నెల ఐదో తేదీన మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ నెల రోజుల అంశాలను మరోసారి చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు అన్నారు . 

Post a Comment

0Comments

Post a Comment (0)