ఆరేళ్లలో 5.5 లక్షల ఉద్యోగాలు కల్పించాం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీపీఎస్సీ) ఉద్యోగాలు పొందిన 496 మంది అఫీసర్లకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ నియామక పత్రాలు అందజేశారు. మిషన్ రోజ్ గార్ పథకం కింద 13 ప్రభుత్వ శాఖల్లో చేపట్టిన నియామకాల్లో భాగంగా ఈ 496 ఉద్యోగాల కల్పన జరిగిందని సీఎం తెలిపారు. యూపీలో ముఖ్యమంత్రి అభ్యుదయ కోచింగ్ సెంటర్స్ లో శిక్షణ తీసుకున్ 43 మంది కూడా ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో గత ఆరేళ్లలో 5.5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు గుర్తుచేశారు. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ఈ-అథియాచన్ పేరుతో మరో కొత్త వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. ఇందులో ప్రతీ ప్రభుత్వ విభాగంలోనూ ఖాళీ అయిన ఉద్యోగాలను ఉంచుతారు. అలాగే వాటి భర్తీకి సంబంధించి తీసుకుంటున్న చర్యల్ని కూడా వెల్లడిస్తారు. తద్వారా ఏయే ప్రభుత్వ శాఖకు ఎంత మంది ఉద్యోగులు అవసరం అన్నది అందరికీ తెలుస్తుందని సీఎం యోగీ తెలిపారు. రాష్ట్రంలో ఆరేళ్ల క్రితం బీజేపీ అధికారంలోకి రాకముందు ఇక్కడి యువత తమ ఉనికి చెప్పుకోవడానికి నామోషీగా ఫీలయ్యే వారని, కానీ ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. ఒకప్పుడు యూపీ ప్రతీ మూడు రోజులకోసారి మత ఘర్షణలు జరిగేవని, పెట్టుబడులు వచ్చేవి కావని, ఉన్న వ్యాపారస్తులు కూడా వాటిని మూసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయే వారని యోగీ గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం యూపీలో చూస్తున్న పరిస్ధితులు వస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు. ఇప్పుడు ప్రతీ ఊరు, పట్టణం, నగరంలో మార్పు కనిపిస్తోందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)