పెన్షన్ రూ. 3వేలు చేశాకే ఎన్నికలకు వెళ్తాం !

Telugu Lo Computer
0


అర్హులందరికీ పెన్షన్ రూ. 3వేలు చేశాకే ఎన్నికలకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. గతంలో 39 లక్షల మందికి రూ. 1000 మాత్రమే పెన్షన్ అందేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.2750 పెన్షన్ ను 64 లక్షల మందికి అందిస్తున్నామని తెలిపారు. వచ్చే జనవరి నుంచి రూ. 3 వేలకు పెంచుతామని జగన్ చెప్పారు. ఏపీ మాదిరిగా పెన్షన్ అందిస్తున్న విధానం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఇక రెషన్ కార్డులు కోటి 46 లక్షలకు పెంచామని జగన్ తెలిపారు. ఏపీ తరహా రేషనింగ్ దేశంలో మరెక్కడ కూడా లేదన్నారు. ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు . ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని జగన్ అన్నారు. గతంలో ఎప్పుడు లేనట్లుగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని జగన్ చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)