జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కు ఇంద్రజకు రూ. 2.5 లక్షలు !

Telugu Lo Computer
0


తెలుగు బుల్లితెర బాగా పాపులర్ అయినా షోలలో `జబర్దస్త్`  ముందు వరసలో ఉంటుంది. కామెడీ షోలకు జబర్దస్త్ కొత్త నాంది పలికింది. మొదట ఒక షోగా ప్రారంభమైన జబర్దస్త్, ఆ తర్వాత రెండుగా మారింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న భారీ ఆదరణ, కమెడియన్ల సంఖ్య పెరగడంతో జబర్దాస్ట్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ గా వారంలో రెండో రోజులు బుల్లితెర ప్రేక్షకులను అలరించేవారు. జబర్దస్త్ షోకు ఒకప్పుడు రెండు కళ్లలా నాగబాబు, రోజా ఉండేవారు. ఆ ఇద్దరి నవ్వులు, కామెంట్లు, జడ్జ్‌మెంట్లతో జబర్దస్త్ షో మూడు పువ్వులు ఆరు కాయల్లా ఉండేది. సుధీర్‌, గెటప్ శ్రీను, ఆది పంచులు స్కిట్లతో రంగరంగ వైభవంగా షో నడిచేది. ఇక అనసూయ అందాలు, రష్మీ గౌతమ్  హోయలు జబర్దస్త్ ఒక ఆకర్షణగా నిలిచేవి. దాంతో ఈ షోకు అదిరిపోయే రేంజ్ లో టీఆర్పీ వచ్చేసింది. బుల్లితెర ప్రేక్షకులకు వినోదం అందిస్తూ.. టీఆర్పీ విషయంలో అగ్ర తాంబూలం అందుకునేది. నాగబాబు, రోజా వెళ్లిపోయాక  జబర్దస్త్ షో పరిస్థితి దారుణంగా మారిపోయింది. వీరిద్దరూ వెళ్లిన తర్వాత సంఘవి, లైలా, ఆమని, కుష్బూ వంటి వారంతా కూడా గెస్ట్ జడ్జ్‌లుగా వచ్చారు.. వెళ్లారు. ఆ తరువాత పూర్ణ, శ్రద్దా దాస్ వంటి వారు కూడా మెరిశారు. అయితే ఏ ఒక్కరు కూడా సెట్ కాలేదు. చివరకు జబర్దస్త్ కు జడ్జ్‌లుగా ఇంద్రజ, కృష్ణ భగవాన్ సెటిల్ అయ్యారు. నాగబాబు, రోజా కి ఇచ్చినంత రెమ్యూనరేషన్ అయితే ఇంద్రజ, కృష్ణ భగవాన్ లకు ఇవ్వడం లేదట. జబర్దస్త్ లో ఇంద్రజ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 2.5 లక్షలు ఛార్జ్ చేస్తుంటే.. కృష్ణ భగవాన్ కు రూ. 3 లక్షలు ముట్టచెబుతున్నారు. ఇక ఇంద్రజ జబర్దస్త్ తో పాటు బుల్లితెరపై మరికొన్ని షోస్‌కు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఈ లిస్ట్ `శ్రీదేవి డ్రామా కంపెనీ` ఒకటి. ఈ షోకు కూడా ఇంద్రజ ఇంచుమించుగా అదే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటుందట.

Post a Comment

0Comments

Post a Comment (0)