రాజస్థాన్‌ లో కొత్తగా 19 జిల్లాలు !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌ లో 19 కొత్త జిల్లాలు, మూడు కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో చెప్పారు. ''రాష్ట్రంలో కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు మాకు అందాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాం. తుది నివేదిక కూడా మాకు అందింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనను ఇప్పుడు చేస్తున్నాను'' అని అసెంబ్లీలో మాట్లాడుతూ గెహ్లాట్ చెప్పారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 50కి చేరుతుందని తెలిపారు. రాష్ట్రంలో నీటిపారుదల సామర్థ్యాన్ని పెంచడం, నీటి వృథాను నివారించేందుకు కెనాల్స్, డ్యామ్‌ల నిర్మాణం కోసం పలు ప్రాజెక్టులను చేపడుతున్నామని, ఇందుకు రూ.37 కోట్ల కేటాయింపులను ఆమోదించామని చెప్పారు. ఉదయ్‌పూర్ జిల్లాలో తాగునీటి కోసం 362.13 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం 200 మంది సభ్యుల రాజస్థాన్ అసెంబలీకి 2023 డిసెంబర్‌లోగా ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. 2018లో గత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమికి అసెంబ్లీలో 108 సీట్లు ఉండగా, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 71 సీట్లు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)