రూ.75 లక్షల కేరళ లాటరీ గెలుచుకున్న బెంగాల్ ‭ వలస కార్మికుడు

Telugu Lo Computer
0


కేరళలోని బువట్టుపుజలో బెంగాల్ ‭కు చెందిన ఎస్.కే బాదేశ్. బతుకుదెరువుకని కేరళ వచ్చి, అక్కడే కూలీగా పని చేస్తున్నాడు. అతడు కొద్ది రోజుల క్రితం కేరళ ప్రభుత్వం నడిపిస్తున్న స్త్రీ శక్తి లాటరీ కొనుగోలు చేశాడు. తాజాగా అది 75 లక్షల రూపాయలు గెలుచుకోవడంతో అంతు పట్టలేని ఆనందం, ఆ వెంటనే భయం తన్నుకొచ్చాయి. అతడికి డబ్బు తీసుకునే వరకు ఉండే ఫార్మాలిటీస్ భయంతో పాటు తన లాటరీని ఎవరైనా దొంగిలిస్తారనే భయం కూడా పెరిగింది. పోలీసులు అతడి పరిస్థితిని అర్థం చేసుకుని, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి, డబ్బు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే బదేశ్ గతంలో ఒకసారి ఇలాగే లాటరీ గెలుచుకున్నాడు. కానీ డబ్బు అందలేదు. ఆ భయం పట్టుకుంది. అందుకే ఈసారి పోలీస్ స్టేషన్ తలుపు తట్టాడు. ఎర్నాకులంలోని చోట్టనికర ప్రాంతంలో నిర్మాణ రంగంలో కాంక్రీట్ పని చేస్తుంటాడు. అతడి స్నేహితుడు కుమార్ సహాయంతో అక్కడ పని చేస్తున్నాడు. అతడికి కనుక ఈ లాటరీ డబ్బులు చేతికి అందితే బెంగాల్ లోని స్వస్థలానికి వెళ్తానని ప్లాన్ చేసుకుంటున్నాడు. తన ఇంటిని బాగు చేసుకుని, వ్యవసాయ పొలాన్ని విస్తరించుకుని అక్కడే వ్యవసాయం చేస్తూ బతకాలని అతడి కోరిక అని తెలిపాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)