ఆంధ్రప్రదేశ్ లో 16 నుంచి 20 వరకు వర్షాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో 16 నుంచి 20వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం పడమర గాలులతో ఏర్పడిన ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ. నుంచి 7.6 కి.మీ. ఎత్తులో ఉంటూ బీహార్‌ నుంచి దక్షిణ కర్ణాటక వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా కొనసాగుతోంది. ఈ నెల 16న మరో ద్రోణి, దక్షిణాది రాష్ట్రాలపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతున్నాయి. వీటి ప్రభావంతో గాలుల దిశ మారనుంది. ప్రస్తుతం రాష్ట్రంపైకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఈ గాలులు దిశ మార్చుకుని దక్షిణ దిశ నుంచి వీచే అవకాశం ఉంది. దీని ప్రభావం 4 రోజులపాటు ఉండనుంది. ఫలితంగా 16 నుంచి 20 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ శనివారం నాటి బులెటిన్‌లో తెలిపింది. అదే సమయంలో క్యుములోనింబస్‌ మేఘాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని, దీంతో అవి ఏర్పడిన ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న ఐదారు రోజులు కూడా ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. ఫలితంగా ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉష్ణతాపానికి కాస్త విరామం లభించనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)