తెదేపాలోకి తులసిరెడ్డి

Telugu Lo Computer
0


తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును నంద్యాలకు చెందిన ప్రముఖ న్యాయవాది తులసిరెడ్డి కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో శనివారం ఆయన్ను కలిసి పార్టీలో చేరిక విషయంపై మాట్లాడారు. మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిలకు ప్రధాన అనుచరునిగా ఉన్న తులసిరెడ్డి 2013లో కొత్తపల్లి సర్పంచిగా పనిచేశారు. అంతకుముందు 2006 నుంచి ఇతని భార్య ఇదే గ్రామ సర్పంచిగా పనిచేశారు. శిల్పా కుటుంబానికి గట్టి మద్దతుదారుగా ఉన్న ఈయన 2015లో తెదేపా ఉమ్మడి జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 2004, 2009, 2019లో శిల్పా కుటుంబం నంద్యాల అసెంబ్లీ నుంచి విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. నంద్యాల మండలం కొత్తపల్లితో పాటు మండలంలోని వివిధ గ్రామాలు, నంద్యాల పట్టణంలో తులసిరెడ్డికి అనుచర వర్గం ఉంది. రెండేళ్లుగా శిల్పా కుటుంబంతో విభేదాలు తలెత్తడంతో గత కొంతకాలం నుంచి ఈయన తెదేపాకు దగ్గరవుతున్నారు. కొన్ని నెలల క్రితం అమరావతిలో చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో తెదేపాకు సేవలు అందించాలని నిర్ణయించుకుని అధికారికంగా పార్టీలో చేరే విషయమై తన అనుచరులతో కలిసి చంద్రబాబును కలిసి చర్చించారు. తనతో పాటు వైకాపా నాయకులు, కార్యకర్తలను తెదేపాలోకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబును కలిసిన వారిలో టి.నాగేశ్వరరెడ్డి, బచ్చు నాగేశ్వరరెడ్డి, పఠాన్‌ జాకీర్‌, చాంద్‌బాషా తదితరులు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)