ధీరేంద్ర శాస్త్రి కార్యక్రమాల్లో ముస్లింలు పాల్గొనవద్దు !

Telugu Lo Computer
0


ధీరేంద్ర శాస్త్రి నిర్వహించే కార్యక్రమాల్లో ముస్లింలను పాల్గొనవద్దని ఆ మత పెద్దలు ఆదేశించారు. దేశాన్ని ముక్కలు చేయడం, హిందూ దేశం ఏర్పాటు గురించి శాస్త్రి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముస్లింలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మధ్య ప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లా, గడ గ్రామంలోని హనుమాన్ దేవాలయం బాగేశ్వర్ ధామ్ చీఫ్‌గా ధీరేంద్ర శాస్త్రి వ్యవహరిస్తున్నారు. తాను ప్రజల సమస్యలను పరిష్కరించగలనని చెప్తున్నారు. దీంతో వందలాది మంది తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన వద్దకు వెళ్తున్నారు. ఆగ్రా మసీదు మేనేజర్ మహమ్మద్ షరీఫ్ కాలా మాట్లాడుతూ, ధీరేంద్ర శాస్త్రి దేశాన్ని ముక్కలు చేయడం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయనకు దూరంగా ఉండాలని ముస్లింలను కోరామన్నారు. సనాతన ధర్మమే గొప్పదని ఆయన మాట్లాడుతున్నారని, తద్వారా హిందూ దేశం ఏర్పాటు గురించి చెప్తున్నారని, ముస్లింలను అవమానిస్తున్నారని అన్నారు. మహమ్మద్ షరీఫ్ కాలాను భారతీయ ముస్లిం వికాస్ పరిషత్ కూడా సమర్థించింది. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శాస్త్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధీరేంద్ర శాస్త్రి శనివారం మాట్లాడుతూ, భారత దేశం త్వరలోనే హిందూ దేశం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ హిందుత్వం గురించి గర్వంగా చెప్పుకునేవారు ఉండే దేశంగా భారత దేశాన్ని చూడాలని విదేశీయులు కూడా కోరుకుంటున్నారన్నారు. ''నేటి కార్యక్రమంలో విదేశీయులు కూడా ఉన్నారు. వారు క్రైస్తవాన్ని ఆచరిస్తున్నప్పటికీ, సనాతన ధర్మం పట్ల విశ్వాసం కలిగియున్నారు. అన్ని కులాల విభేదాలను పక్కనబెట్టి హిందుత్వం గురించి గర్వంగా చెప్పుకునేవారు ఉండే భారత దేశాన్ని వారు కూడా కోరుకుంటున్నారు'' అని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)