హైదరాబాద్ పబ్‌లపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మీక తనిఖీలు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని పబ్బులపై మాదాపూర్‌ పోలీసులు ఆకస్మీక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నలుగురిని సైబరాబాద్​ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఓటీ డీసీపీ ఎం.ఏ. రషీద్ ​వివరాలు వెల్లడిస్తూ మాదాపూర్ ​జోన్‌లోని పలు పబ్బుల్లో నిబంధనలను పాటించటం లేదన్న సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు మొత్తం పదహారు పబ్బులపై దాడులు జరిపినట్లు తెలిపారు. హార్ట్‌కప్, బర్డ్ ​బాక్స్ ​పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్టు గుర్తించినట్లు ఆయన తెలిపారు. బర్డ్ ​బాక్స్ ​పబ్బుకు లైసెన్స్​ లేదని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో హార్ట్ ​కప్ ​పబ్బు యజమాని ఎం.పవన్ ​కుమార్, మేనేజర్​ ఆదిత్య తమంగ్‌ను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బర్డ్ ​బాక్స్ ​పబ్బు యజమాని వంశీవర్ధన్, మేనేజర్​ అర్జున్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బుల గురించి తెలిస్తే 94906 17444 నెంబర్‌కు వాట్సాప్ ​ద్వారా వివరాలు తెలియచేయాలని డీసీపీ కోరారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఫాంహౌస్‌లపై కూడా ఎస్వోటీ పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)