ఔషధ ఉత్పత్తిలో అతి పెద్ద నగరం హైదరాబాద్‌ !

Telugu Lo Computer
0


ఔషధ ఉత్పత్తిలో ఆసియాలోనే హైదరాబాద్‌ అతిపెద్ద నగరంగా ఆవిర్భవించబోతోంది. ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు 7 ఏళ్లలో రూ.25 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఫార్మా రంగానికి హైదరాబాద్ నగరం కేరాఫ్‌గా నిలుస్తున్న నేపథ్యంలో తాజాగా జరిగిన బయో ఏషియా సదస్సు ద్వారా కొత్త మలుపు తీసుకుంది. భారీగా పెట్టుబడులకు వేదికగా నిలిచింది. ప్రపంచంలోని టాప్‌-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌ ఫార్మాసిటీ వరల్డ్‌ లార్జెస్ట్‌ హబ్‌గా అవతరిస్తున్న వేళ పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్‌ అవతరించింది. ప్రపంచపు హెల్త్‌ టెక్‌ మక్కాగా హైదరాబాద్‌ను నిలిపేందుకు తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ప్రపంచం లోనే గొప్ప లైఫ్‌సైన్సెస్‌ కేంద్రంగా ఇప్పటికే వెలుగొందుతున్నప్పటికీ ఇంతటితో ఆగిపోకుండా లైఫ్‌సైన్సెస్‌ రంగానికి మరో కొత్త ఆకృతినిచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌కు 7 ఏళ్లలో రూ.25 వేల కోట్లు వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. కేటీఆర్ ఫార్మాకు హైదరాబాద్ ప్రపంచంలోనే అనుకూల వేదికగా మార్చేందుకు పలు నిర్ణయాలుఅమలు చేస్తున్నారు. 15ఏళ్ల క్రితం తమ కంపెనీ ఇక్కడ ఒక కెపాసిటీ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు వచ్చిందని, ఇప్పుడు కంపెనీ కార్యకలాపాలు 10 రెట్లు పెరిగాయని ఫార్మా దిగ్గజాలు హైదరాబాద్ లో అవకాశాల గురించి చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ నగరంలో 20కి పైగా లైఫ్‌సైన్సెస్‌, మెడ్‌టెక్‌ ఇంక్యుబేటర్లు ఉన్నాయి. ప్రపంచంలోని టాప్‌-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగన బయో ఫార్మా సదస్సులో పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు మంత్రి కేటీఆర్ తో చర్చలు చేసారు. పెట్టుబడుల వివరాలను వెల్లడించాయి. రూ 500 కోట్లతో ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ సంస్థను నెలకొల్పనున్నట్లు ప్రఖ్యాత ఎస్ జీడీ, కోర్నింగ్ సంస్థలు ప్రకటించాయి. ఫాక్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఇప్పటికే రూ 200 కోట్లతో హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. తాజాగా మరింత విస్తరణకు నిర్ణయించింది. తెలంగాణలో మరో 20 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రముఖ సంస్థ పీఎస్ఎల్ ప్రకటించింది. అమెరికాకు చెందిన జూబిలెంట్ సంస్థ వెయ్యి కోట్లు, ఫ్రాన్స్ సంస్థ సనోఫి రూ 250 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. పరిశ్రమకు చెందిన ప్రముఖలతో బయో ఏషియో సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపన.. విస్తరణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)