బ్రిటన్‌ మార్కెట్లలో అందుబాటులో లేని టమాటాలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 23 February 2023

బ్రిటన్‌ మార్కెట్లలో అందుబాటులో లేని టమాటాలు !


బ్రిటన్‌లో కూరగాయలు, పండ్లు ప్రజలకు అందుబాటులో లేవు. నచ్చినదాన్ని కొనుక్కుందామని సూపర్‌మార్కెట్లకు వెళ్లే బ్రిటన్‌వాసులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఒక్కొక్క కస్టమర్‌కు మూడు టమాటాలు మాత్రమే అమ్ముతామంటూ బోర్డులు కనిపిస్తుండటంతో అవాక్కవుతున్నారు. టెస్కో, అస్డా, అల్డి, మోరిసన్ వంటి ప్రముఖ సూపర్‌మార్కెట్లలో కూరగాయలు, పండ్లను పెట్టే అరమరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీనికి కారణాలు ఏమిటని ఆరా తీస్తే ప్రతికూల వాతావరణం వల్ల పంటల సాగు ఇబ్బందికరంగా మారిందని వెల్లడైంది. గోరుచుట్టుపై రోకటి పోటులా విద్యుత్తు ఛార్జీల ప్రభావం కూడా ఉందని తెలిసింది. ఈ పరిస్థితి మరో మూడువారాల పాటు కొనసాగవచ్చునని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. అయితే కొన్ని ఇతర సూపర్‌మార్కెట్లలో కొరత ఉన్నప్పటికీ, అమ్మకాలపై పరిమితులు విధించకపోవడం విశేషం. టెస్కో సూపర్‌మార్కెట్ బ్రిటన్‌లో చాలా పెద్దది. అదే విధంగా డిస్కౌంటర్ అల్డి సూపర్‌మార్కెట్ కూడా జనాదరణ కలిగినదే. ఈ దుకాణాల్లో ఒక్కొక్క కస్టమర్‌కు కేవలం మూడు టమాటాలు మాత్రమే అమ్ముతున్నారు. పెప్పర్స్, కుకుంబర్స్ కూడా మూడు ప్యాకెట్ల చొప్పున మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా అస్డా సూపర్‌మార్కెట్ కూడా తోటకూర, సలాడ్ బ్యాగ్స్, బచ్చలి కూర, కాలిఫ్లవర్, రాస్ప్‌బెర్రీ ప్యాకెట్లను పరిమితంగా మాత్రమే అమ్ముతున్నారు. మరో ప్రముఖ సూపర్‌మార్కెట్ మోరిసన్స్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. కస్టమర్లకు ఇక్కడ మరింత నిరాశ ఎదురవుతోంది. టమాటాలు, కుకుంబర్స్ రెండేసి మాత్రమే ఇస్తున్నారు. తోటకూర, పెప్పర్స్ ప్యాకెట్లు రెండేసి చొప్పున మాత్రమే అమ్ముతున్నారు. మొత్తం మీద అన్ని సూపర్‌మార్కెట్లలోనూ టమాటాలు, పెప్పర్స్‌కు విపరీతమైన కొరత ఉంది. అందరూ వీటిని నిత్యం కోరుకోవడం వల్ల ఇలా జరుగుతోందా? అనేది తెలియడం లేదు. పండ్లు, కూరగాయల కొరత మరికొన్ని సూపర్‌మార్కెట్లను వేధిస్తున్నప్పటికీ, అమ్మకాలపై పరిమితులను విధించలేదు. సెయిన్స్‌బరీ మాజీ సీఈఓ జస్టిన్ కింగ్ మాట్లాడుతూ, రిటెయిలర్లు స్టాక్‌ను పెద్ద మొత్తంలో కొనే అవకాశం ఉన్నందువల్ల కస్టమర్లకు పరిమితులు విధిస్తున్నట్లు తెలిపారు. వీథుల్లో తిరుగుతూ వ్యాపారం చేసేవారు సూపర్‌మార్కెట్లలోని అరమరాలను ఖాళీ చేయకూడదనే ఉద్దేశంతోనే పరిమితంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు చెప్పారు. చలికాలంలో బ్రిటన్‌కు అవసరమైన టమాటాల్లో 95 శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. 90 శాతం తోటకూర కోసం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇవి ఎక్కువగా స్పెయిన్, ఉత్తర ఆఫ్రికాల నుంచి వస్తాయి. అయితే దక్షిణ స్పెయిన్‌లో చలి తీవ్రత అసాధారణంగా ఉంది. వరదల వల్ల మొరాకోలో పంటల దిగుబడి దెబ్బతింది. తుపానుల వల్ల రవాణా సదుపాయాలు ప్రభావితమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో టమాటా, ఉల్లిపాయలు, బంగాళా దుంపలను పశ్చిమ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడాన్ని మొరాకో నిలిపేసింది. యూరోపు దేశాలకు వీటిని పంపించడంలో ఆటంకాలు ఎదురవకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ సాధారణంగా ఈ కాలంలో పండ్లు, కూరగాయలను స్వదేశీ రైతుల నుంచి, నెదర్లాండ్స్ నుంచి సేకరిస్తూ ఉంటుంది. కానీ ఈ రెండు దేశాల్లోనూ విద్యుత్తు ఛార్జీలు విపరీతంగా ఉండటంతో రైతులు చలికాలంలో సాగును తగ్గించుకున్నారు. బ్రిటన్ రైతులకు ప్రభుత్వం మరింత సాయం చేయాలని నేషనల్ ఫార్మర్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. విద్యుత్తు, ఇంధనం విషయంలో ప్రోత్సాహకాలు పారిశ్రామిక రంగానికి లభిస్తున్నాయని, ఈ పథకంలో ఉద్యానవన రంగాన్ని కూడా చేర్చాలని కోరుతోంది.

No comments:

Post a Comment