ట్యూబెక్టమీ చేయించుకున్నందుకు భార్యను గెంటేశాడు !

Telugu Lo Computer
0


ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో మూడు రోజుల క్రితం తన భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో జానకి దేహూరి తన పిల్లలతో కలిసి దిమిరియా గ్రామంలోని తన ఇంటి బయటే ఉంటోంది. ప్రతీ సంవత్సరం పిల్లలకు జన్మనివ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి స్థానిక ఆశా కార్యకర్త ద్వారా ఒప్పించడంతో మహిళ ట్యూబెక్టమీకి వెళ్లాలని నిర్ణయించుకుంది. పెళ్లయిన 11 ఏళ్లలో ఆమె 11 మంది పిల్లలకు జన్మనిచ్చింది, అయితే వారిలో ఒకరు మరణించారు. నా పిల్లలు పెరుగుతున్నప్పుడు ప్రతీ సంవత్సరం గర్భం దాల్చడం చాలా ఇబ్బందిగా ఉందని, మా ఊరి ఆడవాళ్లు చాలా మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా, నా భర్త అర్థం చేసుకోకుండా నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని జానకి చెబుతోంది. మరోవైపు ఆపరేషన్ చేయించుకుని భార్య నేరం చేసిందని ఆమె భర్త రవి ఆరోపిస్తున్నాడు. మేము భూయాన్ కమ్యూనిటికి చెందిన వారమని సమాజంలో ఉన్న నమ్మకం ప్రకారం ఆడవాళ్లకు ఆపరేషన్ చేస్తే నీళ్లు రావని నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని  రవి దేహూరీ అన్నారు. ఒక వేళ భార్య ఇంట్లోకి వచ్చేప్రయత్నం చేస్తే చంపేందుకు మారణాయుధాలతో ఇంటి ముందే తిరుగుతున్నాడు. తరచూ గర్భం దాల్చడం వల్ల జానకీ ఆరోగ్యం దెబ్బతిందని.. గర్భం దాల్చలేనంత బలహీనంగా మారిందని.. 10 మంది పిల్లలను పెంచడం కుటుంబానికి కష్టం అవుతోందని ఆశా వర్కర్ విజయ లక్ష్మీ బిస్వాల్ అన్నారు. దీంతో అధికారులు రవిని ఒపించి అతని భార్యను ఇంట్లోకి రానివ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంతకు ఒప్పుకోకపోవడంతో అధికారులు జానకీ, ఆమె పిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించి, భర్త రవిపై పోలీసుకు ఫిర్యాదు చేస్తామని అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)