'విల్లు-బాణం'ను కోల్పోవడంపై సంజయ్ రౌత్ స్పందన

Telugu Lo Computer
0


ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం న్యాయం కాదని, వ్యాపారం ఒప్పందం అని దీని కోసం ఏకంగా 6 నెలల్లో రూ. 2000 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఉద్దవ్ ఠాక్రే వర్గం నాయకుడు ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. రూ. 2000 కోట్ల కేవలం ప్రాథమిక అంచనా అని, ఇది వందశాతం నిజమని, అధికార పక్షానికి దగ్గరగా ఉండే ఓ బిల్డర్ ఈ విషయాలను వెల్లడించారని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని రౌత్ అన్నారు. మా పార్టీ, విల్లుబాణం గుర్తును కొనుగోలు చేసేందుకు భారీగా డీల్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్లు, ఎంపీలకు రూ. 100 కోట్లు, మా కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు రూ. 50 లక్షల నుంచి 1 కోట్ల వరకు చెల్లించి పార్టీ మారేలా చేశారని.. అలాంటిది మా పార్టీని, చిహ్నాన్ని తీసుకోవడానికి ఎంత చెల్లించి ఉండాలో అంచనా వేయండి..? అంటూ ప్రశ్నించారు. శివసేన పార్టీ, ఎన్నికల గుర్తును సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ ఈసీ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై కేంద్ర హోంమంత్రి సత్యమేవ జయతే అంటూ వ్యాఖ్యానించారు. అమిత్ షా చెప్పే దాన్ని సీరియస్ గా తీసుకోలేదని, న్యాయం, సత్యాన్ని కొనుగోలు చేసే వ్యక్తుల గురించి మనం ఏం చెప్పగలం? అంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారనినేది సమయం వచ్చినప్పుడు చూపెడతాం అని.. ఇప్పుడే దీనిపై ఏం మాట్లాడం అని సంజయ్ రౌత్ అన్నారు. అయితే ఏక్ నాథ్ షిండే వర్గం ఈ విమర్శలను తోసిపుచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)