అసెంబ్లీ సమావేశాలకు చెవిలో పూలతో కాంగ్రెస్ నేతలు !

Telugu Lo Computer
0


కర్నాటకలో అసెంబ్లీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెవిలో పూలు పెట్టుకొని హాజరైయ్యారు. ఆయన్ను మరికొందరు నేతలు అనుసరించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న కర్ణాటకకు ఇదే చివరి బడ్జెట్‌. ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తోన్న ముఖ్యమంత్రి బసరాజ్‌బొమ్మై ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.  గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌, 2018 మేనిఫెస్టో హామీలను నెరవేర్చకుండా భాజపా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టారు. మొత్తం 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం బొమ్మై, ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గత బడ్జెట్‌లో ప్రకటించిన పనుల్లో కేవలం 10శాతం మాత్రమే అమలు చేశారని.. రాష్ట్ర అప్పులు రూ.3లక్షల కోట్ల మార్కును దాటాయని సిద్ధరామయ్య ఆరోపించగా.. దీనిపై సీఎం బొమ్మై దీటుగా స్పందించారు. గతంలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. కర్ణాటక చరిత్రలోనే ఆయన గరిష్ఠంగా అప్పులు చేశారంటూ విరుచుకుపడ్డారు. 2023-24 ఏడాదికి తాము ప్రవేశపెట్టేది మిగులు బడ్జెట్‌ అని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)