స్నూపింగ్ కేసు విచారణకు సీబీఐకి అనుమతి !

Telugu Lo Computer
0


సిసోడియాను ఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్‌బీయూ)కు సంబంధించి స్నూపింగ్ కేసులో  విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతించింది. ఈ మేరకు సీబీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో ఎఫ్‌బీయూ ఏర్పాటు చేసింది. దీని కోసం రూ.1 కోటి నిధులు కేటాయించింది. ప్రభుత్వ అధికారులు, సంస్థలు ఎలా పని చేస్తున్నాయో నిఘా వేసి, సంబంధిత సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం ఈ సంస్థ చేయాల్సిన పని. దీని ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగవుతుందని ఆప్ తెలిపింది. అయితే, ఎఫ్‌బీయూను ఆప్ తమ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ నేతలపై నిఘా పెట్టేందుకు వాడుకుందని సీబీఐ ఆరోపణ. అంతేకాదు దీని కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయని కూడా మరో ఆరోపణ. వీటన్నింటిపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ప్రభుత్వానికి చెందిన ఎఫ్‌బీయూ ముసుగులో సిసోడియా రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డారని సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు అనుమతివ్వాలని సీబీఐ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కోరింది. దీంతో ఆయన భారత రాష్ట్రపతికి, కేంద్రానికి లేఖ రాశారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనికి స్పందించిన కేంద్ర హోం శాఖ సిసోడియాను ఈ కేసులో విచారించేందుకు అనుమతించింది. దీంతో ఎఫ్‌బీయూ స్నూపింగ్ కేసులోనూ సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయన లిక్కర్ స్కాంలో కూడా సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం వచ్చే ఆదివారం ఆయన సీబీఐ ముందు హాజరు కావాల్సి ఉంది.


ఏంటీ ఎఫ్‌బీయూ


Post a Comment

0Comments

Post a Comment (0)