తండ్రికి కాలేయం దానం చేసిన కుమార్తె !

Telugu Lo Computer
0


కేరళలోని త్రిశూర్‌కు చెందిన ప్రతీష్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో అతడికి కాలేయం మార్పిడి అవసరమైంది. తనకు తగ్గ లివర్ దాత కోసం వెతికినా సరైన అర్హతలు కలిగిన దాతలు దొరకలేదు. చివరకు ప్రతీష్  పదిహేడేళ్లే కూతురు దేవానంద లివర్ దానం చేసేందుకు ముందుకొచ్చింది. దేవానంద ఇంటర్ సెకండియర్ చదువుతోంది. నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు దాటిన కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు మాత్రమే దానం చేయాలి. దీంతో పదిహేడేళ్లే ఉండటంతో ఆమె అవయవదానంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో దేవానంద కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అన్ని అంశాలు పరిశీలించిన కోర్టు వైద్యుల సూచనతో ఆమె అవయవ దానానికి అంగీకరించింది. అవయవదానం చేసే ముందు ఆమె జిమ్‌కెళ్లి వ్యాయామం చేసింది. ప్రత్యేక డైట్ తీసుకుంది. నిపుణుల పర్యవేక్షణలో అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈ నెల 9న దేవానంద తన లివర్‌లోని కొంత భాగాన్ని తండ్రికి ఇచ్చింది. వైద్యులు ప్రతీష్‌కు కాలేయం మార్పిడి శస్త్రచికిత్స చేశారు. వారం తర్వాత దేవానంద కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. దేవానంద ప్రస్తుతం అత్యంత చిన్న వయసులో అవయవదానం చేసిన దాతగా గుర్తింపు దక్కించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)