హాస్టల్‌లో విషాహారం తిని బాలిక మృతి

Telugu Lo Computer
0


ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలోని సోరో పట్టణం లో పురుబాయి కన్యాశ్రమంలో  చదువుతున్న బాలికలు అక్కడి హాస్టల్‌లో శుక్రవారం భోజనం చేశారు. అనంతరం పలువురు విద్యార్థులు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. దాంతో ఆహారం కలుషితం కారణంగా ఇలా జరుగుతున్నదని గ్రహించిన హాస్టల్‌ సిబ్బంది వారిని స్థానిక ఆసుపత్రికి  తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ పదవ తరగతి విద్యార్థిని రబీనా సింగ్‌  శనివారం ఉదయం చనిపోయింది. మరో 25 మంది బాలికలను చికిత్స నిమిత్తం సోరో సీహెచ్‌సీలో చేర్చారు. విద్యార్థినిలు వాంతులు చేసుకోవడంతో వెంటనే ఆసుపత్రికి  తరలించినట్లు కన్యాశ్రమ కార్యదర్శి సుమతి మొహంతి తెలిపారు. హాస్టల్‌లో అందిస్తున్న నీరు, ఆహారం కలుషితం కావడం వల్లే బాలికలు అస్వస్థతకు గురయ్యారని సోరో సీహెచ్‌సీ వైద్యులు పేర్కొన్నారు. బాలికలు గత నాలుగు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నారని వారు చెప్పారు. విచారణ పూర్తయ్యేంత వరకు బాలిక మరణంతోపాటు ఇతర బాలికల అనారోగ్యానికి దారితీసిన విషయం గురించి వ్యాఖ్యానించలేమని బాలాసోర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ దులాల్‌సేన్ జగదేవ్‌ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)